J SURENDER KUMAR,
ప్రఖ్యాత పర్యావరణవేత్త, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మృతి పట్ల ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వేలాదిగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్క నిస్వార్థ సేవలను సమాజం ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు.
దేశవ్యాప్తంగా అటవీ సంపదను పెంచడానికి తిమ్మక్క ఎంతో స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. చెట్లను నాటడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. తిమ్మక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి అభిమానులు, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.
