తీరనున్న హై టెన్షన్ విద్యుత్ తీగల సమస్యలు !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మపురి నియోజకవర్గానికి ₹ 4 కోట్ల నిధులు !

J. SURENDER KUMAR,

ఇంటి స్థలాలు, నివాస గృహాల పైనుండి దశాబ్దాల కాలంగా వెళుతున్న హై టెన్షన్ విద్యుత్ తీగల సమస్యలతో సతమతమవుతున్న ధర్మపురి నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్య పరిష్కారం కానున్నది
.

ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వానికి స్థల, ఇంటి యజమానుల సమస్యలు ఇబ్బందులు వివరించి విద్యుత్ తీగల మార్పిడికి వేలాది రూపాయల డబ్బులు విద్యుత్ శాఖకు చెల్లించే స్తోమత వారికి లేదని ప్రభుత్వానికి వివరించి ప్రభుత్వ నిధులతోనే విద్యుత్ తీగలు మార్పిడికి ఆదేశాలు జారీ చేయించారు.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గ పరిధిలో హై టెన్షన్ విద్యుత్ తీగల మార్పిడికి ₹ 4.03 కోట్ల నిధులు విద్యుత్ శాఖ కు కేటాయించింది.

👉 గొల్లపల్లి మండలంలో..

తీగల మార్పిడిలో భాగంగా మంగళవారం గొల్లపల్లి మండలంలోని శ్రీరాముల పల్లె గ్రామంలో ₹ 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇండ్ల పై నుండి వెళ్ళే కరెంట్ లైన్ల మార్పిడి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్   కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ వివేకానంద, తదితర వాడలలో హై టెన్షన్ విద్యుత్ తీగలు మార్పిడి జరగనున్నాయి.

👉 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు !

మండలానికి చెందిన ₹ 60 లక్షల రూపాయల విలువ గల 60 కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు అదే విధంగా ఇందిరా మహిళ శక్తి చీరలను మహిళా సోదరీమణులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

👉 విద్యుత్ శాఖలో బదిలీలు…

ధర్మపురి మండలం విద్యుత్ శాఖ రవి పదోన్నతి పై కరీంనగర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ నుంచి రమేష్ ధర్మపురికి బదిలీ చేసినట్టు సమాచారం. అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. కొంతకాలంగా ధర్మపురి డివిజన్ ఏడిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన సింధు శర్మ స్థానంలో జనార్ధన్ కు పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం.