J.SURENDER KUMAR,
హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
