👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో బుధవారం వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
వృద్ధులకు అవసరమైన సేవలు, భద్రత, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అవకాశాలు విస్తరించడానికి సమగ్ర కార్యక్రమాలు రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక ఘనంగా నిర్వహించబడింది.
