👉 ట్రక్ షీట్ల నమోదులో అవినీతి ట్రిక్కులు !
👉 రైస్ మిల్ యజమానుల కొనుగోలు కేంద్రాల నిర్వహకుల మాయాజాలం !
J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకంను ఆసరా చేసుకుని జగిత్యాల జిల్లాలోకొందరు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సన్న బియ్యం పథకం వారి పాలిట వరంగా ప్రభుత్వం పాలిట శాపంగా మారింది.
కొందరు రైస్ మిల్ యజమానులు, కొందరు వరి ధాన్యం కొనుగోలు (ఐకెపి పిఎసి ఎస్) నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించే ట్రాన్సిట్ లో అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ జేబులో నింపుకుంటున్నారు అనే చర్చ జోరుగా జరుగుతుంది..
👉 ప్రభుత్వ ఖజానాకు గండి ఇలా…
ప్రభుత్వం సన్నధాన్యం ( ఏ గ్రేడ్ , సాయిరాం వడ్లు సన్న వడ్లు ) పండించిన రైతాంగానికి క్వింటాలకు ₹ 500/- గిట్టుబాటు ధరకు అదనంగా బోనస్ చెల్లిస్తున్నది. దీంతో రైతుకు క్వింటాలు ఒక్కంటికి ₹ 2890/- ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్నది. ఈ ధాన్యం రైస్ మిల్లులకు తరలించి బియ్యం గా మార్చి సివిల్ సప్లై గోదాములకు తరలించి అక్కడినుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తుంది.
కొనుగోలు కేంద్రాల నుండి వరి ధాన్యం ప్రభుత్వం కేటాయించిన రైస్ మిల్లులకు వాహనాల ద్వారా తరలింపులో రైతు పేరు, ధాన్యం వివరాలు, ఎన్ని క్వింటాళ్లు తదితర వివరాలు నిర్వాహకులు ట్రక్ షీట్లలో నమోదు చేసి వాహనం వెంట రైస్ మిల్లుకు పంపిస్తారు.
కొనుగోలు చేసిన సన్న వడ్లు సాయిరాం (ఏ గ్రేడ్) కాగా ట్రక్ సీట్ లో బిపిటి ధాన్యంగా ( ఇది ఏ గ్రేడ్ పరిధిలోకి వస్తుంది ) కొన్ని సందర్భాల్లో దొడ్డు వడ్లను సైతం ట్రక్ షీట్ లో నమోదు చేస్తారు.

👉 వేలాది రూపాయల కమిషన్..
బిపిటి బియ్యం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో మార్కెట్ లో దాదాపు క్వింటాల్ కు ₹ 2500/- ధరకు లభిస్తుంది. రైస్ మిల్ నిర్వాహకులు సాయిరాం సన్న వడ్లు, లేదా బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు క్వింటాలు ఒక్కంటికి ₹ 3000/- కు పైగా విక్రయిస్తుంటారు. తక్కువ ధరకు లభించే బి పి టి బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి సివిల్ సప్లై గోదాములకు తరలిస్తుంటారు. క్వింటాలు ఒక్కంటికి కనీసం ₹ 200/– రూపాయల కమిషన్ చొప్పున లారీ ఒక్కంటికి దాదాపు ₹ 50 వేల వరకు రైస్ మిల్ యజమానుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందుతుంది.
జిల్లాలో ఈ సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా ఓ ఆధునిక రైస్ మిల్లుకు దాదాపు15 వందల లారీల సన్నా వడ్ల ను కేటాయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ మిల్లులో శనివారం నాటికి 50 లారీలకు మించి ధాన్యం నిలువలు లేనట్టు సమాచారం.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి క్వింటాలకు 5 కిలోల తరుగు. పేరిట నిర్వాహకులు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టేందుకు నిర్వాహకులు మిల్లర్లు శ్రీకారం చుట్టారు.
👉 అడిషనల్ కలెక్టర్ తనిఖీ లోవెలుగు చూసిన ట్రక్ షీట్ ల బాగోతం !
శుక్రవారం అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత మండలంలోని దమ్మన్నపేట, రాజారం, దుబ్బల గూడెంలోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ లో ట్రక్ షీట్ బాగోతం వెలుగు చూసింది. రైతు నుంచి సన్నరకం ధాన్యం తీసుకొని మరోరకం ధాన్యం పేరిట ట్రక్ట్ షీట్ ఇచ్చి మోసానికి పాల్పడుతున్న బాగోతం ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రంలో బయటపడింది.
దమ్మన్నపేట గ్రామంలో సన్నరకం పేరిట మరోరకం ధాన్యం అని ట్రక్ట్ షీట్ ఇవ్వడంపై సంబంధిత అధికారిపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులను సైతం తనిఖీ చేసి నివేదికలు అందించాలని సూచించారు. తనిఖీలలో జిల్లా సివిల్ సప్లై అధికారి జితేందర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ లు ఉన్నారు. ట్రక్ షీట్ బాగోతం ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో వేచి చూద్దాం..
