విద్యార్థి వైద్యం కోసం ఎంతైనా భరిస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పిడుగుపాటుతో ఇటీవల గాయపడి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థి హిమేష్  కు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా భరిస్తుందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైద్యులకు స్పష్టం చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్  విద్యార్థి హిమేష్ ను కుటుంబ సభ్యులను  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రాత్రి పరామర్శించారు.  విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యుల  అడిగి తెలుసుకున్నారు

మంత్రి  చొరవతో విద్యార్థి వైద్యానికి ఇప్పటివరకు ₹ 8లక్షల 80 వేల రూపాయల సంక్షేమ శాఖ విడుదల చేసింది.