వివాహ వేడుకలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వేములవాడ పట్టణంలో గురువారం జరిగిన సీనియర్ బిజెపి నాయకుడు ప్రతాప రామకృష్ణ కుమారుడు   త్రిపురాంత్ , శ్రీ హర్షిని వివాహ వేడుకలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, తదితర ప్రముఖులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

👉 మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారా ప్రభాకర్ మృతి పట్ల మంత్రి సంతాపం !

ధర్మారం పట్టణ వాస్తవ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మరియు మాజీ వైస్ ఎంపీపీ నారా ప్రభాకర్ మృతి చెందారు.  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నారా ప్రభాకర్  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

👉 మంత్రికి కృతజ్ఞతలు !

పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థి హిమేష్ చంద్ర, వైద్య చికిత్స కోసం ₹ 18,18,842/- ఖర్చును ప్రభుత్వమే భరించింది. చొరవ చూపిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ను  సంక్షేమ వసతి గృహ అధికారులు మరియు ఆఫీస్ సిబ్బంది కలిసి  కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా  మంత్రి  మాట్లాడుతూ, వసతి గృహ విద్యార్థులకు సంబందించిన డైట్, కాస్మోటిక్, వసతి గృహ రెంట్ చార్జీలు విడుదల చేయడం జరిగిందని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం క్రింద విదేశాలలో పి.జి. చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹.20 లక్షలు ఇటీవలే విడుదల చేయడం జరిగిందని,

విద్యార్థుల చదువు విషయములో సంక్షేమ అధికారులు శ్రద్ధ వహించాలని, చలికాలం వచ్చినందున విద్యార్థులకు ఉలెన్  బ్లాంకెట్స్, స్వెటర్లు సరఫరా మరియు విద్యార్థులు వేడి నీటితో స్నానం చేయుటకు సోలార్ వాటర్ హీటర్స్ సరఫరా చేయుటకు సోమవారం లోపు నివేదికలు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్  కార్యాలయ సూపరింటెండెంట్ ఎం.డి. జావీద్ ఇక్బాల్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి . శ్రీనివాస్ , వసతి గృహ సంకేమ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.