👉 మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై సమీక్ష !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి మున్సిపాలిటీతో పాటు మిగతా రెండు మున్సిపాలిటీ పరిధుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ధర్మపురి, జగిత్యాల మరియు రాయికల్ మున్సిపాలిటీ పరిధుల్లో పలు పథకాలపై జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ లతో కలిసి శనివారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ

పలు ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి త్వరగా పనులు పూర్తిచేయాలని
సంబంధిత అధికారులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.
ధర్మపురి, జగిత్యాల మరియు రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న పనుల గురించి వివరించారు, రానున్న వేసవి కాలం లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి సూచించారు.
👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాట్లాడుతూ….
జగిత్యాల నియోజకవర్గం లో జగిత్యాల మున్సిపాలిటీ మరియు రాయికల్ మున్సిపాలిటీ లు ఉన్నందున పలు ప్రభుత్వ పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను కోరారు.
👉 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్, నగరాభివృద్ధి, యు.ఐ.డి.ఎఫ్, టి.యు.ఎఫ్.ఐ.డి.సి ప్రభుత్వ పథకాల ద్వారా పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, సంబంధిత మున్సిపల్ కమిషనర్ లు, డి.ఈ.ఈ లు, ఏ.ఈ.ఈ లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
