👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామాలలో మీరు ఆశించిన, మీరు అంచనా వేస్తున్న, అభివృద్ధి పనులు జరగాలంటే అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు గెలిపిస్తే నే గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలంలోని కమలాపూర్, తిమ్మాపూర్, రాయపట్నం గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పరిపాలన నూతన దశకు చేరిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు, జీవన భద్రతను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేడు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణుల కోసం ₹ 500 గ్యాస్ సిలిండర్ పథకం, రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు, విద్యార్థులకు విద్యాధన–వసతిధన రాయితీలు, నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలు వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.

ధర్మపురి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల విస్తరణ, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
