ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుగ్గారం మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి  పట్నాల మహోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని ఎల్లమ్మ తల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

గ్రామాల్లోని  ఆలయాలలో నిత్యం ధూపదీప నైవేద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయంలోనే ధూప దీప నైవేద్యం పథకం అమలు చేశామన్నారు.

ఆలయాలలో భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, మహోత్సవం నిర్వహణలో దేవస్థాన కమిటీ, స్థానిక అధికారులు చేసిన ఏర్పాట్లు అభినందనీయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.