👉 ₹151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన !
J.SURENDER KUMAR,
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో ₹151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
👉 శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు
👉 ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ₹15 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు.
👉 ₹ 121.92 కోట్ల రూపాయలతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం.
👉 ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం.
👉 ₹15 కోట్ల రూపాయలతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు.
👉 ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
