👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ఇందిరమ్మ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు కల్పించే మహత్తర కార్యక్రమం ప్రారంభమైంది. అర్హులైన ప్రతీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని హనుమాన్ వాడలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ముప్పట్ల సుమలత కు మంజూరైన ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్, లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ పూజా కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారు కుటుంబానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఇందిరమ్మ పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి సంబంధిత బిల్లులు పొందాలని సూచించారు. గ్రామాల్లో అర్హులైన వారు ఉన్నట్లయితే వెంటనే అధికారులను సంప్రదించి నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
నిర్మాణం ఆలస్యమైతే, ఇతర అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే పరిస్థితి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రొసీడింగ్స్ వచ్చిన లబ్ధిదారులంతా త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని మంత్రి లబ్ధిదారులను కోరారు.
👉 ఆర్థిక సహాయం !

ధర్మపురి పట్టణం స్థానిక ముదిరాజ్ వాడకు చెందిన రాజేందర్ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ₹ 20 వేల ఆర్థిక సహాయం అందించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజేందర్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజేందర్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు వివరించారు. స్పందించిన మంత్రి హైదరాబాదులోని ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
