👉 మంథని కోర్ట్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవానీ !
J . SURENDER KUMAR,
క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టు కేసులలో ఇరుపక్షాలు రాజీ పడి ప్రశాంతగా జీవనం కొనసాగించడానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని మంథని కోర్ట్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవానీ అన్నారు.
మంథని కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అధాలత్ లో 335 కేసులు రాజి కుదుర్చుకొని పరిష్కరించుకున్నారు.
👉 ఈ సందర్భంగా కక్షిదారుల ఉద్దేశించి సివిల్ జడ్జీ శ్రీమతి వి భవానీ మాట్లాడుతూ..
రాజీమార్గం లో పలు కేసులను పరిష్కారం అయతె కోర్టుల కు భారం తగ్గి తీవ్ర మైన నేరాలు సత్వరం పరిష్కారిచవచ్చని, క్షణి కావేశంలో చేసిన నేరాలకు జరిమానాలు, రాజీ ద్వార పరిష్కారం దొరుకుతున్నారు, సివిల్ కేసులలో రాజీ చేసుకున్న సందర్బంలో కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడుతాయని వివరించారు.
ఈకార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి ఏ సుదా రాణి, ఎపిపి సందీప్ రెడ్డి, బార్ అసోషియేషన్ ఉపాధ్యక్షులు కె రఘోతం రెడ్డి, లోక్ అధాలత్ సభ్యులు కటుకం శ్రీనివాస్, డి. విజయ్ కమార్, కనుకుంట్ల స్వామి, న్యాయ వాదులు శశిభూషణ్ కాచె, కె వ్యాస్ కుమార్, సిరివెన్నెల, గోదావరిఖని 2వ పట్టణ సీ.ఐ.ప్రసాద్ రావు, మంథని, ముత్తారం,రామగిరి, కమాన్పూర్ ఎస్ఐ లు, డేగ రమేష్, రవికుమార్, శ్రీనివాస్, ప్రసాద్, వివిద బ్యాంకుల అధికారులు, కక్షి దారులు పాల్గొన్నారు
