చెక్ డామ్ కూలడం పై విచారణ జరపండి !

👉 పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు !

J . SURENDER KUMAR,

మానేరు నదిపై అడవి సోమన పల్లి వద్ద నాణ్యత ప్రమాణాలు పాటించకుడా నిర్మించిన చెక్ డ్యాం కూలిన సంఘటనపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతూ మంథని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు శనివారం ఫిర్యాదు చేశారు.

పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరియు కరీంనగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న మానేరు నదిపై గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో DMFT మరియు ఇతర ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోవడం పై అధికారులు, కాంట్రాక్టర్లు, పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో రైతాంగంలో అనుమానాలు మొదలయ్యాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.

కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రకటనలు ఇవ్వడం, సంబందిత ఇరిగేషన్ అధికారులు అపోహలు సృష్టించే విధంగా ప్రకటనలు ఇవ్వడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ చెక్ డ్యాంలు అనతి కాలంలోనే కూలిపోవడంపై సమగ్ర విదారణ జరిపించి, బాధ్యులైన వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

.