👉 గ్లోబల్ సమ్మిట్ కు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా సీఎంలకు ఆహ్వానం !
J.SURENDER KUMAR,
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరుకావాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ సీఎంలను ప్రభుత్వ పక్షాన ఆహ్వానించే కీలక బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అప్పగించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలకు వెళ్లిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అక్కడి రాష్ట్రా ప్రభుత్వాల పక్షాన మంత్రికి ప్రోటోకాల్ స్వాగతం పలికారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ను ఆహ్వానించారు.
శనివారం పంజాబ్, హర్యానా రాష్ట్రలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ వెళ్లారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తరపున పంజాబ్ రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సాధారణంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో హర్యానా ముఖ్యమంత్రి, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి తో స్వయంగా ఫోన్ లో మాట్లాడించారు. సీఎం ఆహ్వానం పై హర్యానా ముఖ్యమంత్రి మరియు పంజాబ్ ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రెండు రాష్ట్రాల మంత్రులతో, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చర్చించారు.
ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలకు కీలక వేదికగా ఇది మారనుంది.
