👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం పద్ధతి కాదని, ఎవరి దయదాక్షిణ్యాలతోనూ సీఎం కుర్చీలో కూర్చోలేదని, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లు వేసి సీఎం పదవి కట్ట పెట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
కరీంనగర్ పట్టణంలోనీ స్థానిక R&B గెస్ట్ హౌస్ లో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలసి మాట్లాడారు.
👉 మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..

జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా వెల్లడైందని అన్నారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారని స్పష్టం చేశారు.
👉 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌కే పరిమితమై ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కేటీఆర్‌కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్‌రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అన్నారు.
👉 అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఇరిగేషన్ అంశంపై చర్చ ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని గుర్తు చేశారు.
👉 అదే విధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై చర్చ జరిగినా ఆయన హాజరు కాలేదన్నారు. ప్రజలను అవహేళనగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు.
👉 గత పాలనలో రాష్ట్ర బడ్జెట్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, సాగు తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
