సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి !

👉 నూతన సర్పంచ్ ల పదవీ స్వీకార మహోత్సవములో….

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మీ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలను ప్రభుత్వం ద్వారా సమకూర్చి, త్రాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఎండపెల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో నూతన సర్పంచ్ భూక్య సంగీతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్ లు  జీరెడ్డి మహేందర్ రెడ్డి, సర్పంచ్ భూక్య సంగీతలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన సాగించాలని వారిని కోరారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

  పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థులందరికీ అందేలా చూడాలని సర్పంచ్‌లకు సూచించారు.

గ్రామంలోని యువత, మహిళలు, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబన దిశగా ముందుకు సాగాలని కోరారు.

కొత్తపేట, కొత్తూరు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, మండల అధికారులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.