👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో ఆధునిక సంస్కరణల తో పాటు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక విజన్ తో నిధులు మంజూరు చేస్తున్నదని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
షేక్‌పేట్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో రాష్ట్రంలో మొదటి పొగరహిత మోడల్ మెకనైజ్డ్ కిచెన్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

.
షేక్‌పేట్ నూతనంగా ప్రవేశ పెట్టిన మోడల్ కిచెన్ రాష్ట్ర సంక్షేమ విద్య రంగంలో నూతన ప్రమాణాలను ప్రవేశపెట్టి తొలి అడుగు వేస్తోందనీ మంత్రి అన్నారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు విద్యను అలాగే సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని మంత్రి ఆరోపించారు.
👉 గురుకుల విద్యాలయ విద్యార్థులు ఐఏఎస్ , ఐపీఎస్ లుగా ఇంజనీర్లుగా , డాక్టర్లుగా ఉన్నత హోదాలో స్థిరపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
👉 గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న డైట్ మెస్ ఛార్జీలు తాను మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన నాడే సీఎం ప్రత్యేక చర్వ తీసుకొని పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారని మంత్రి తెలిపారు. గురుకుల సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులను గ్రీన్ చానల్స్ లో మంజూరు కాన్నట్టు మంత్రి తెలిపారు.
👉 విద్య ఒకటే మానవుల, వ్యక్తిగత, సమాజ స్థితిగతులను మార్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు గుర్తు చేశారు.

👉 తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వసతి గృహాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారని వారికి (విద్యార్థులకు) ఏ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి అన్నారు.
👉 తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తూ గొప్ప స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులకు హితబోధ చేశారు.
👉 విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలిగిన వాటి పరిష్కారం కోసం నిధులు విషయంలో మంజూరు చేసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మంత్రి అన్నారు.
👉 ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నేరుగా సంక్షేమానికి ₹ 60 కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
👉 మోడ్రన్ కిచెన్ రాష్ట్రంలోనే కీలకమైన సంస్కరణ !

ఈ ఆధునిక కిచెన్ ద్వారా విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం సమయానికి అందించేందుకు పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
👉 వంట ప్రక్రియ మొత్తం పొగరహితం కావడంతో కార్మికులకు ఆరోగ్య సమస్యలు తగ్గి సురక్షిత పని వాతావరణం ఏర్పడుతోందన్నారు. అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులకు వంటను అతి తక్కువ సమయంలో, ఆటోమేటెడ్ విధానంలో జరగడంతో మానవ తప్పిదాలు గణనీయంగా తగ్గనున్నాయనీ తెలిపారు.
👉 ఈ మోడ్రన్ కిచెన్ వల్ల పరిశుభ్రత ప్రమాణాలు పెరగడంతో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఆహారము లేదా వంటను వంటడంలో నీటి శుద్ధినీ, వెజిటబుల్ సానిటైజేషన్, ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రక్రియలు ఆటోమేటెడ్ కావడం వల్ల ఆహార భద్రత కు అవకాశం వుంటుందన్నారు.
👉 ఈ కిచెన్ కు సంబంధించి మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయడం వల్ల నాణ్యతతో మంచి క్వాలిటీ ఫుడ్ ను అందించేందుకు అలాగే పర్యవేక్షణ కూడా ఎంతో మెరుగు పడుతుందన్నారు.

👉 గురుకులాల్లో విద్యార్థులకు ఇచ్చే భోజనంలోని హైజీన్, పోషక విలువలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక మెను రివ్యూ కమిటీలు పనిచేస్తున్నాయనీ తెలిపారు.
👉 హాస్టల్లో ఆహారం వండే క్రమంలో శుభ్రత లేని కారణంగా వచ్చే సమస్యలు పూర్తిగా తగ్గేలా ఆధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేపట్టామని మంత్రి తెలిపారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం , విద్య అన్న లక్ష్యంతో సంక్షేమ శాఖ ముందుకు సాగుతోందన్నారు.
👉 షేక్‌పేట్ గురుకుల పాఠశాలలలో మోడల్ మోడల్ కిచెన్ ను రాష్ట్రవ్యాప్తంగా మిగతా SC, ST, గురుకులాల్లో దశల వారీగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు..
👉 విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భోజన వసతులు…వంటగది మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ మంత్రి తెలిపారు.
👉 ఆహార పదార్థాల కొనుగోలు మరియు నిల్వల్లో పారదర్శకత కోసం డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నామన్నారు.
👉 ఆటోమేటెడ్ కుకింగ్ సిస్టమ్ కారణంగా అనుకున్న టైమ్ కు టిఫిన్, లంచ్, డిన్నర్ అందించే అవకాశం వుంటుందన్నారు.
👉 పరిశుభ్ర వాతావరణం, కాలుష్యరహిత వంటశాలలు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కీలకం అవుతాయనీ చెప్పారు.
👉 ఈ ఆధునిక కిచెన్ స్థాపనతో తెలంగాణ రాష్ట్ర హాస్టళ్లు దేశంలోనే సంక్షేమ మోడల్‌గా నిలిచే దిశగా ముందుకు సాగుతున్నాయనీ అన్నారు.
👉 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడ సమాన ప్రాధాన్యంగా భావిస్తున్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణా ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖాదీ రావన్ పలని ,జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్ , స్టేట్ ఆఫీసర్ నిర్మల, మల్టీ జోన్ ఆఫీసర్ రజిని , జోనల్ ఆఫీసర్ లక్ష్మాంజలి, TGSWREIS COE షేక్ పేట ప్రిన్సిపల్ బాలస్వామి , సోహం ఇంపెక్స్ కంపెనీ అధినేత ప్రకాష్ , ఆక్సిఫియల్ రెటీఫ్లో టెక్నాలజీస్ కంపెనీ అధినేత భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
