కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సభలో !

J.SURENDER KUMAR,

140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల, ప్రజాస్వామిక పార్టీగా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు చరిత్ర ఉందని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ కార్యక్రమం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు.


స్థానిక  పటేల్ విగ్రహం వద్ద నుండి వేలాదిమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పంచవర్ష ప్రణాళిక, స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గరీబి హటావో నినాదం, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, దేశానికి అందించిన సేవలు వారి ప్రాణ త్యాగాలు వెలకట్టలేవని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 2004 నుంచి 2014  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో యు పి హెచ్ చైర్ పర్సన్ సోనియాగాంధీ, తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టకుండా త్యాగం చేసి, ఆర్థిక నిపుణుడు  మన్మోహన్ సింగ్ ను రెండుసార్లు ప్రధాని గా ఎంపిక చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు గత శతాబ్ద కాలంగా కట్టుబడి ఉంటుందని మంత్రి అన్నారు.