కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి గ్రామ అభివృద్ధి చేసుకోండి !

👉 దొంతపూర్ గ్రామ ఎన్నికల ప్రచార సభలో మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించండి, మీరు కోరిన విధంగా మీ గ్రామాభివృద్ధికి నిధులను డిమాండ్ చేయండి అంటూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలో శనివారం రాత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఉదయశ్రీ కి మద్దతుగా గ్రామంలో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..


గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, దొంతపూర్ గ్రామంలో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థి ఉదయశ్రీ కి తమ మద్దతు తెలిపారు.