కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు !

👉 కండువా కప్పి స్వాగతించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 జైన సింగిల్ విండో చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి,మాజీ సర్పంచ్ లు !

👉 నా వెన్నంటి ఉన్న కార్యకర్తలను మర్చిపోను !.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి మండల టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి మంత్రి స్వాగతించారు.

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం  మండలానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, పార్టీలో చేరారు.

👉 కాంగ్రెస్ లో చేరిన నాయకులు !

👉 టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ధర్మపురి మండల టిఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు, నక్కల పేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ మొగిలి శేఖర్.

👉 రెండవసారి జైన సింగల్ విండో చైర్మన్ గా, కేడీసీ బ్యాంక్ జిల్లా కమిటీ డైరెక్టర్, కొనసాగుతున్న సౌల నరేష్.

👉 గత రెండు దశాబ్దాలుగా రాజకీయంలో రాజారాం గ్రామ సర్పంచ్ గా, ధర్మపురి మండల పరిషత్ అధ్యక్షుడిగా, జెడ్పిటిసి సభ్యుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా  పదవులు నిర్వహించిన సౌల భీమయ్య,

👉 రెండుసార్లు రాజారాం గ్రామ సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన తాజా మాజీ సర్పంచ్ జెల్ల బుచ్చన్న. తమ తమ అనుచర గణాంతో మంత్రి సమక్షంలో చేరారు.

👉 నాగారం గ్రామానికి చెందిన ఉత్తమ రైతు, ప్రముఖు న్యాయవాది, ఆత్మ అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి,

👉 ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదంతో  ఎమ్మెల్యేగా,విప్ గా  మంత్రిగా మీ ముందు కొనసాగడం జరుగుతుందని, 2009 నుండి ఇప్పటి వరకు అనేక కష్టాలు ఎదురైన ప్రజలను నమ్ముకొని వారి కష్ట సుఖాల్లో కలసి ఉన్నానన్నారు.

కష్టాల్లో తన వెంట, కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కార్యకర్తలను మర్చిపోయే వ్యక్తిని కాదని, పార్టీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందు ఉన్న కార్యకర్తలకు కాపాడుకుంటామని, రోల్లవాగు ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రానున్న పుష్కరాలు కూడా అందరి సలహాలు, సూచనల తో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాల గూర్చి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో  సమావేశాలు జరిగాయన్నారు. ఈ ప్రాంతానికి నిధుల కేటాయింపులో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని సీఎంను కోరినట్టు మంత్రి తెలిపారు.