కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే అభివృద్ధికి కీలకం!

👉 పంచాయతీ  ఎన్నికలలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బిజీ …బిజీ !

👉 పెగడపెల్లి, బుగ్గారం మండలాలలో ప్రచారం !

J.SURENDER KUMAR,

పల్లెలు, పంచాయతీలు అభివృద్ధి దిశలో పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సభ్యులు, సర్పంచ్  అభ్యర్థుల గెలుపు కీలకం అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపల్లి, బుగ్గారం మండలాలలోని పలు గ్రామాలలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు.

పెగడపెల్లి మండలంలోని నంచర్ల, బతికపెల్లి గ్రామాలు, పెగడపెల్లి పట్టణ కేంద్రం తోపాటు బుగ్గారం మండల కేంద్రంతో పాటు సిరికొండ, మద్దునూరు, గ్రామాల్లో  ప్రచారం చేశారు.

👉 ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో  ప్రచార సభలలో మంత్రి  మాట్లాడుతూ….

ప్రజల నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు, జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పథకాలు నేడు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని మంత్రి అన్నారు.

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులు, వ్యవసాయ సహాయాలు, పశుసంవర్ధక సౌకర్యాలపై ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించామని మంత్రి వివరించారు.

మండల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేస్తూ ఈ లక్ష్యాన్ని సాధించాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రచార సభలలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.