👉 ₹ 20 లక్షల నిధులు మంజూరు !
J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ నడి బొడ్డున గల చింతామణి చెరువు, కోనేరు, తంబాలకుంట చెరువులకు మహర్దశ పట్టనున్నది..పురాణ చారిత్రాత్మక నేపథ్యం గల చింతామణి చెరువు ధర్మపురి క్షేత్ర నడిబొడ్డున ఉన్నది. ఈ చెరువు లో శుభ్రమైన వర్షపు నీటి నిలువల కోసం సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, మొదటి విడతగా ₹ 20, లక్షల నిధుల సాంకేతిక మంజూరు చేయించారు.

ఈ మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, చెరువులో పిచ్చి మొక్కలను తొలగించి నిలువ నీటిని శుభ్రపరిచారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం జెసిబి యంత్రాలతో తొలగించారు. చింతామణి చెరువు నీటి నిల్వలతో కాశెట్టివాడ, బోయవాడ, హనుమాన్ వాడల తో పాటు పట్టణంలో భూగర్భ జలాల నీటిమట్టం గణనీయంగా పెరగనున్నది.

ప్రభుత్వం రిజర్వాయర్ గా ఎంపిక చేసిన ఈ చెరువులో స్వచ్ఛమైన నీటి నిలువలు బాక్టీరియా మరియు వైరస్‌లు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే మురుగునీటి ద్వారా నీరు కలుషితమైందో లేదో తెలుసుకోవడానికి నిరంతరం పరీక్షలు జరుగుతుంటాయి.

సుందరి సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ లైటింగ్ ఓపెన్ జిమ్ము, హనుమాన్ విగ్రహ ప్రాంతంలో పిల్లల పార్కు తదితర పనులు చేపట్టడానికి మున్సిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించింది. దీంతోపాటు తెలుగువాడలోని తంబళ్లకుంట చెరువు, బ్రహ్మ పుష్కరిణి ( కోనేరు ) శుద్ధి కార్యక్రమానికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
