ధర్మపురిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు !

👉 68 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ !

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొని 68 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గతంలో 104 మంది  లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరా మహిళా శక్తి, వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిని, మున్సిపల్ కమిషనర్, ధర్మపురి మండల ఎంఆర్వో, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.