ధర్మపురి  లో వైభవంగా ముక్కోటి ఉత్సవాలు !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం  ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ , జగిత్యాల కలెక్టర్ బి.సత్య సత్యప్రసాద్ , ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్చార్జ్  జువ్వడి నర్సింగరావు, ప్రముఖ గుండె శస్త్ర చికిత్సనిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి, ప్రముఖ సమున్నతి బ్యాంక్, అడ్వైజర్ గుండి విష్ణు ప్రసాద్,  తెల్లవారుజామున స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ లిస్ట్ రంగ అశోక్,  పెద్దపల్లి న్యాయమూర్తి, జగిత్యాల ఆర్డిఓ డిఎస్పి తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సందర్భంగా క్షేత్రం, ఆలయం, ఆలయ ప్రాంగణం పూలతో అంగరంగ వైభవంగా ముస్తాబయింది. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు

ముక్కోటి ఏకాదశి పర్వదినము రోజున ప్రాతంకాలము (ఉదయత్ పూర్వం) 3 గం॥లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల వార్లు మూల విరాట్లకు వేద పండితులు అర్చకులు  విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుష్పం నిర్వహించారు.

👉 ప్రాతఃకాలమున 4.00 గం॥టలకు వైకుంఠ ద్వారము వద్ద పుష్ప వేదికపై వేంచేపు చేయించి మువ్వురు స్వాములకు వేద పండితులుప్రత్యేక పూజలు నిర్వహించారు.

👉 ఉ॥5.00 గం॥లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ , ఏదో పండితులు అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం వైకుంఠ  ద్వారం  తెరిచారు.

వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో  భక్తజనం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు.

👉 భక్తుల దర్శన అనంతరము శ్రీవార్ల ఉత్సవ మూర్తుల సేవలు పుర వీధులలో ఉదయం 8-00 గంటలకు ఊరేగింపు జరిగింది.

👉 లక్షలాది రూపాయల వెండి ఆభరణాల బహుకరణ !

ముక్కోటి పర్వదినం సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి లక్షలాది రూపాయలు విలువగల దాదాపు పది కిలోల వెండి ఆభరణాలను మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి బహుకరిస్తూ ఆలయ అధికారులు పాలకవర్గానికి అప్పగించారు.

👉 క్యాలెండర్ ఆవిష్కరణ. పుస్తకాల పంపిణీ !


పుష్ప వేదిక వద్ద మంత్రి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ బి సత్యప్రసాద్, ఆలయ అధికారులు 2026 నూతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్యాలెండర్ ను. ఆవిష్కరించారు . తిమ్మరాజు  విశ్వపతి రామకృష్ణమూర్తి రచించిన  శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము “.  పుస్తకాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు కాకర్ అమర్ శర్మ పంపిణీ చేశారు. 1988  ఎస్ఎస్సి బ్యాచ్  బృందం ఆలయ ప్రాంగణంలో  భక్తులకు బాదంపాలు పంపిణీ చేశారు.

ధర్మపురి ఆలయాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించడంతోపాటు ద్వారా తోరణాలు ఏర్పాటు చేశారు. పుష్పాలు విద్యుత్తు కాంతులతో ఆలయ ప్రాంగణం అపర వైకుంఠంలో విరాజిల్లుతున్నది. మంగళవారం స్వామివారికి.
₹ 8 లక్షల 52 వేల 904 రూపాయల ఆదాయం వచ్చింది.