ధర్మపురి ముక్కోటి ఉత్సవాలకు మంత్రులకు ఆహ్వానం !

👉 సాంప్రదాయ పద్ధతిలో సమయపాలన పాటించండి  మంత్రి అడ్లూరి !

J . SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 30న అంగరంగ వైభవంగా జరగనున్న ముక్కోటి ఉత్సవాలకు రావలసిందిగా కోరుతూ, సోమవారం  మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ కమిషనర్ హరీష్ లను ఆలయ అర్చకులు, వేద పండితులు, కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది కలసి మంత్రులను ఆహ్వానించారు.

👉 సమయపాలన పాటించండి.. మంత్రి లక్ష్మణ్ కుమార్ !

గత కొన్ని రోజుల క్రితం ముక్కోటి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై , స్థానిక క్షేత్ర వేద పండితులు, ఆలయ అర్చకులు , వేద పండితులు , పాలకవర్గం , ఆలయ అధికారులతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

సనాతన సాంప్రదాయ పద్ధతిలో  పండితులు, ఆలయ అర్చకులు, నిర్ణీత సమయంలో భక్తులకు ముక్కోటి ద్వారా దర్శనం కల్పించాలని, సెలబ్రిటీలు, వీఐపీల కోసం ఎట్టి పరిస్థితుల్లో పూజది కార్యక్రమాలు, ఉత్తర ద్వార దర్శనం లో జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని భగవంతుడి ముందు అందరూ సమానమే అని కార్యనిర్వహణాధికారికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.

👉 దేవాదాయ శాఖ మంత్రికి ఆహ్వానం..

దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  శ్రీమతి కొండ సురేఖ ను సోమవారం హైదరాబాదులో మంత్రి నివాసంలొ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , అర్చకులు నంబి అరుణ్ కుమార్ , బొజ్జ రాజగోపాల్, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ తో కలిసి  ఆహ్వనం తో పాటు శేష వస్త్ర ప్రసాదం చిత్రపటం. బహుకరించారు.

👉 రవాణా శాఖ మంత్రి కి ఆహ్వానం…


సాయంత్రం హైదరాబాద్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  నివాసంలొ ఆలయ కార్యనిర్వహణాధికారి,  అర్చకులు నంబి అరుణ్ కుమార్ , బొజ్జ రాజగోపాల్ సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ తో కలిసి  ఆహ్వనం తో పాటు శేష వస్త్ర ప్రసాదం చిత్రపటం అందించారు.

👉 దేవాదాయ కమీషనర్ కు ఆహ్వానం….

హైదరాబాద్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ కార్యాలయంలో కమీషనర్ డాక్టర్ హరీష్ ను  ఈఓ సంకటాల శ్రీనివాస్, అర్చకులు నంబి అరుణ్ కుమార్ , బొజ్జ రాజగోపాల్  సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ తో కలిసి ఆహ్వనం తో పాటు శేష వస్త్ర ప్రసాదం చిత్రపటం బహుకరించారు.