ధర్మపురి రెవెన్యూ డివిజన్ చేస్తా బస్సు డిపో తెస్తా !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

నా నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిని రెవెన్యూ డివిజన్ గా చేస్తాను, ధర్మపురికి ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు తెస్తాను, అసంపూర్తిగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి నియోజకవర్గంలో ప్రతి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్పష్టం చేశారు.

కరీంనగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

నా నియోజకవర్గం పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


👉 గత ప్రభుత్వంలో 2016లో జీవో నం.71 ప్రకారం ప్రారంభించి రోళ్ళ వాగు ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయలేదని, అంచనాలను ₹ 136 కోట్లకు పెంచారని,ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్‌తో చీకటి ఒప్పందాలు చేసుకొని పనులు ప్రారంభించారని ఆరోపించారు.
ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు అమలుకాలేదన్నారు

👉 కాళేశ్వరం లింక్–2 పేరుతో 1,020 ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని,  అప్పటి మంత్రులు 146 గ్రామాలకు సాగునీటి గూర్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వాధినేతలను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని మంత్రి విమర్శించారు.

👉 కాళేశ్వరం లింక్-2 పేరుతో వెల్గటూర్ కంకర కొట్టి జీవించే ఒడ్డెర జాతి ప్రజలను పోలీసులతో వారిని బెదిరించి వారి జీవనోపాధి కొల్లగొట్టి కంకర గుట్టలను ఖాళీ చేయించారని ఆరోపించారు. దీంతోపాటు రైతులను భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరించారని ప్రజలను మోసం చేయడం తనకు తెలియదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

👉 తాను కేవలం ఆరు నెలలుగా మంత్రిగా ఉన్నప్పటికీ, 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి వారి అడ్మిషన్లు బదిలీ చేయించి ₹ 7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు.

👉 ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ ప్రభుత్వంలో మూతపడిన తెలుగు కళాశాలను తెరిపించాను, ఐటిఐ డిగ్రీ కాలేజ్ తెచ్చాను, ఎల్లంపల్లి ప్రాజెక్టులు భూ నిర్వాసితులకు ₹ 17 కోట్లు వారికి చెల్లించానని, ధర్మపురి ఆలయ అర్చకుల ఉద్యోగుల స్వీపర్ల జీతాలు పెంచానని,  ట్రైబల్ మినిస్టర్ ద్వారా ₹ 60 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని, వాడ–వాడ అభివృద్ధికి ₹ 3 కోట్లు కేటాయించామని మంత్రి అన్నారు.

👉 మేడారం, లక్ష్మీ నరసింహ రిజర్వాయర్, వెల్గటూర్ స్తంభంపల్లి, అక్క పెళ్లి చెరువులు తదితర రిజర్వాయర్ల లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై త్వరలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

👉 గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, ప్రస్తుతం మా పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు.

👉 గత పాలకులు జిల్లాకు చెందిన దళిత మంత్రిని  అవమానించారని విమర్శించారు. తన రాజీనామాపై మాట్లాడే వారికి సమాధానంగా నేను రాజీనామా చేయాలా ?  వద్దా ?  అనేది ధర్మపురి నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు” అని మంత్రి స్పష్టం చేశారు.

👉 జనవరి చివరి వారం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతో నిధులు వెచ్చించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్మపురికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉంటానని తెలిపారు.

👉 మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టమైన సవాల్ విసిరారు. మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఆధారంగానే ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతానన్నారు.