దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత రెండు సంవత్సరాల పాలనలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు అమలు చేసిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో బుధవారం దివ్యాంగుల బదిరుల ఆశ్రమ పాఠశాలలో  మహిళలు పిల్లలు, దివ్యాంగులు వయోవృద్ధుల సాధికారత శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సంక్షేమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సుడ ఛైర్మెన్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….


అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో దివ్యాంగుల విద్యార్థులతో కలసి దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.


👉 దివ్యాంగ ఉద్యోగుల బదిలీలలో వారి అభిప్రాయం మేరకు మినహాయింపులు, పోస్టింగులు ఉండాలని ప్రత్యేక జీవో విడుదల చేశామని మంత్రి అన్నారు. దీనికి తోడు దివ్యాంగ దినోత్సవ సందర్భంగా ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సెలవు అమలు ఏ విధంగా ఈ నెలలో ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని మంత్రి వివరించారు.

👉 సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి  ఇవ్వని విధంగా దివ్యాంగుల శాఖలకు ₹50 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి  మంజూరు చేయడం జరిగిందన్నారు.

👉 దివ్యాంగులు దైవ స్వరూపులు వారి అవసరాలు గుర్తించి వారికి సంబంధించిన  విద్య విషయంలో కేవలం పదవ తరగతి వరకు మాత్రమే కాకుండా ఉన్నత తరగతులు నిర్వహణ కోసం సీఎం  సహకారంతో ఇంటర్, డిగ్రీ వరకు  చదువుకునే విధంగా చర్యలు చేపట్టనున్నామని మంత్రి అన్నారు.

👉 గత ప్రభుత్వంలో దివ్యాంగుల సంక్షేమం గూర్చి పట్టించుకోలేదని  మా ప్రభుత్వంలో  దివ్యాంగుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని,  వారికి ఇచ్చే స్కూటీలు, బ్యాటరీ సైకిల్  కూడా త్వరలోనే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.  అనంతరం మంత్రి విద్యార్థులతో  మాట్లాడి వారి కళా ప్రదర్శనలు తిలకించి  వారితో కలిసి భోజనం చేశారు.