దళంలో లేని వారు – అదృశ్య మైన వారి జాబితాలో ఉన్నారో?

👉 పోలీస్ ల భయంతో పారిపోయిన కొందరు పోలీస్ రికార్డులలో నక్సలైట్ నాయకులు ?

👉 మానవహక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ సాహసంతో  వివరాలు నమోదు !

J.SURENDER KUMAR,

గత మూడున్నర దశాబ్దాల క్రితం ఉత్తర తెలంగాణ జిల్లాలలోని గ్రామాల నుండి  అదృశ్యమైన కొందరు యువకులు  మావోయిస్టులలో ( అజ్ఞాత నక్సలైట్ దళంలో ) లేరనే వార్తలు ప్రచార మాధ్యమాల్లో  చెక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రభుత్వ జాబితాలో అదృశ్యమైన వారి పేర్లు ఉన్నాయా ? లేవా ? అనేది చర్చ .

మానవ హక్కుల నేత, స్వర్గీయ డాక్టర్ బాలగోపాల్, సాహసంతో మాయమైన వారిని, పోలీసులు మాయం చేసిన వారి వివరాలను, టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ ముందు మూడున్నర దశాబ్దాల క్రితమే నమోదు చేయించారు. పోలీసు కేసుల భయంతో గ్రామం వదిలి పారిపోయిన కొందరి పేర్లు మాత్రం పోలీసు రికార్డులలో  దళసభ్యుడు, దళ నాయకుడు, కీలక డేన్ ఇంచార్జ్, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా పదోన్నతులు పొందిన ఉదంతాలు కూడా ఉన్నాయి.

👉 చెన్నారెడ్డి ప్రభుత్వం నియమించిన టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ !

1980 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  నక్సలైట్ నాయకులు మరియు పౌర హక్కుల కార్యకర్తల అదృశ్యం  నకిలీ ఎన్‌కౌంటర్ల పై దర్యాప్తు చేయడానికి జస్టిస్ టిఎల్‌ఎన్ రెడ్డి  విచారణ కమిషన్‌ ను 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం నియమించింది.

ప్రత్యేకంగా నక్సలైట్ నాయకులు గోపగాని ఐలయ్య , బుర్ర రాయమల్లు అదృశ్యాలను, నాటి ఉదయం దినపత్రిక జర్నలిస్ట్ గులాం రసూల్,  అతని స్నేహితుడు విజయ ప్రసాద్ బూటకపు ఎన్కౌంటర్ తో పాటు 45 మంది ఇతర వ్యక్తుల అదృశ్యాలపై విచారణకు నాటి ప్రభుత్వం టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ నియమించింది.

నాడు నక్సల్స్, అధికార పార్టీ నాయకులను టార్గెట్, కిడ్నాప్ చేసి అదృశ్యమైన మా నాయకుల  ఆచూకీ చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, వీరితోపాటు పౌర హక్కుల నాయకులు, ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ఒత్తిడి భరించలేక నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆయా సంఘటనలపై కమిషన్ ను నియమించారు.

👉 టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ నియామకం వెనక..

ఉత్తర తెలంగాణ కార్యదర్శి గోపగాని ఐలయ్య హుజురాబాద్   మంగపేటకు చెందిన బుర్ర రాయమల్లు, కరీంనగర్ కు చెందిన వసంత @ సుజాత (రమణారెడ్డి భార్య) హైదరాబాద్ నవరంగ్ టాకీస్ వద్ద  కొరియర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వీరిని  కిడ్నాప్ చేసి అదృశ్యం చేశారు అని  పీపుల్స్ వార్ నక్సల్స్ అధికార పార్టీ నాయకుల పై తెచ్చిన ఒత్తిడి మేరకు ప్రభుత్వం కమిషన్ నియమించింది.

👉 డాక్టర్ బాలగోపాల్, జోక్యంతో  వెలుగు చూసిన దళిత యువకుడి బూటకపు ఎన్కౌంటర్ !

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు బోరేగాని రాజం ను మంచిర్యాల్ జిల్లా చెన్నూరు అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్ తో కాల్చి చంపారు, అంటూ డాక్టర్ బాలగోపాల్  దొంతపూర్ గ్రామానికి వచ్చి. యువకుడి తల్లిదండ్రులకు వివరించే వరకు వారికి తన కొడుకు మృతి చెందిన విషయం తెలియదు. మంచిర్యాల ప్రాంతంలో భూస్వామి ఇంటిలో పనిచేస్తున్నట్టు మాత్రమే వారికి తెలుసు.

యువకుడి తల్లిదండ్రులను హైదరాబాదులో టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ కు ఫిర్యాదు చేయించడానికి వచ్చిన బాలగోపాల్ కు వారి పూరి గుడిసెను చూసి చలించి పోయాడు. లక్షేట్టిపేట న్యాయస్థానంలో  ఎన్కౌంటర్ కు సంబంధించిన  వివరాలను, డాక్యుమెంట్లను సేకరించారు.  యువకుడి తల్లిదండ్రులకు
హైదరాబాద్ కు రావడానికి బస్ కిరాయిలు ఇచ్చారు హైదరాబాదులో వారికి నూతన వస్త్రాలు కొనిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అదృశ్యమైన అనేకమంది వివరాలను డాక్టర్ బాలగోపాల్ టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ ముందు నమోదు చేయించారు. ఆ అధికారిక వివరాల జాబితా పరిశీలిస్తే మూడున్నర దశాబ్దాల క్రితం అదృష్టమైనట్టుగా చెప్పుకుంటున్న వారి వివరాలు వారి కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం ఉండవచ్చు..

👉 పోలీస్ రికార్డులలో నక్సల్స్ డేన్ కీపర్ గా గొల్లపల్లి గంగన్న !

2010 సంవత్సరంలో కరీంనగర్  పోలీసులు పక్కా సమాచారంతో  గుజరాత్ రాష్ట్రం సూరత్ లో గొల్లపల్లి గంగారం ఇంటిపై  మెరుపు దాడి చేసి గంగారం ను అదుపులో తీసుకొని  వస్తుండగా
గుజరాత్ పోలీసులు ఇక్కడి పోలీసులను అడ్డుకున్నారు.  ఇప్పటికే  తాము షోహాబుద్ధిన్ ఎన్కౌంటర్,  సిబిఐ విచారణ తో సతమతం అవుతున్నామని, గంగన్న ను ఇక్కడి కోర్టులో ప్రవేశపెట్టి పిటి వారెంట్ పై తీసుకెళ్లాలని సూరత్ పోలీసులు ఇక్కడి పోలీసులను డిమాండ్ చేశారు.

పోలీసులు సూరత్  కోర్టులో గంగారం ను హాజరు పరిచి పిటి వారెంట్ పై జగిత్యాల కు తీసుకువచ్చారు.. పోలీస్ అధికారులు  ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి  తాము పట్టుకున్న గంగారం నక్సల్స్ డేన్ కీపర్,  మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నాడంటూ సమావేశంలో వివరించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

👉 గంగారం కు నక్సలైట్లకు సంబంధం లేదు !

ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి దొంతపూర్ గ్రామ భూస్వామి ఇంటిపై 1978లో రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పలువురితో పాటు అమాయకుడైన గొల్లపల్లి గంగారం పేరును  నక్సలైట్ సానుభూతిపరుడిగా పోలీసు రికార్డులో నాడు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో గంగారం భయంతో గ్రామం విడిచి  భీమండికి పారిపోయాడు. అక్కడ కార్మికుడిగా పని చేస్తూ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు గుజరాత్ కు వెళ్లారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. గుజరాత్ లో కార్మిక సంఘం నాయకుడిగా గంగారంకు గుర్తింపు. నక్సలైట్ కార్యకలాపాలకు ఆయనకు దశాబ్దాల కాలంగా సంబంధాలు లేవు. భార్యాపిల్లలతో కిరాణ వ్యాపారం చేస్తూ సూరత్ లో  జీవనం కొనసాగిస్తున్నాడు.

👉 కూతురి పెళ్లి ప్రయత్నంలో ఫోన్ ట్రాప్ చేశారు !

గంగారం తన కూతుర్ని   తన సోదరి( అక్క) కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నంలో దొంతపూర్ లో అక్కతో సెల్ ఫోన్ తో మాట్లాడాడు.  నువ్వు నక్సలైట్లలో కలిసావట, నీ బిడ్డను చేసుకుంటే నా కొడుకు మాకు కష్టాలు, తమ్ముడు,అంటూ గంగారం సోదరి పెళ్లికి నిరాకరించింది.

నన్ను నమ్ము అక్క నేను ఏ నక్సలైట్ పార్టీలలో లేను, పోలీసుల భయంతో పారిపోయి వచ్చాను అని గంగారం పదేపదే ఫోన్లో వేడుకునే వాడు  ( దాదాపు నెల రోజులుగా వీరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది ) పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఏమిటి ? పోలీసులతో ఇబ్బందులు ఏమిటి ? అంటూ గంగారం సోదరి  ఓ వైట్ కలర్ వ్యక్తిని  సంప్రదించింది.  పోలీసు రికార్డులలో గంగారం కీలక నక్సలైట్ గా, అతడు పై రివార్డు ఉండడంతో, వైట్ కలర్ వ్యక్తి ఏదో ఆశించి వీరి ఫోన్ నెంబర్లతో సహా వివరాలను పోలీసులకు చేరవేశాడు. ఫోన్ పై నిఘా ఉంచిన పోలీస్ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్ లో గంగారం ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు.

గుజరాత్ లో గంగారం ను పోలీసులు పట్టుకున్న తీరు, గంగారం కుటుంబం, వారి జీవన విధానం, భార్యా పిల్లల వివరాలు సూరత్ లో వారి ఆధార్, ఓటర్, ఐడి కార్డులు. ఇద్దరు ఆడపిల్లల ఫోటోలతో. గంగారం పట్టుబడింది ఇలా అంటూ. ప్రముఖ దినపత్రికలో నాడు వార్త  ప్రచురితమైంది..

వార్తకు  న్యాయమూర్తులు, పోలీస్ యంత్రాంగం స్పందించారు. గంగారం సమీప బంధువు, అప్పటి దొంతపూర్ మాజీ సర్పంచ్ రాగల్ల బుచ్చయ్య, జరిగిన సంఘటనలు స్వర్గీయ దేవాదాయ శాఖ మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు వివరించారు. రత్నాకర్ రావు జోక్యం చేసుకొని అప్పటి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించి గంగారాం ను జైలు నుంచి విడుదల చేయించారు. గంగారం పక్షాన ధర్మపురి మాజీ ఎంపీపీ న్యాయవాది బెత్తపు లక్ష్మణ్ వాదించారు.