J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో బీఆర్ఎస్ కీలక నాయకులు, తమ అనుచర గణంతో గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం..
కొన్ని నెలలుగా తమ, తమ అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీలో చేరికల గూర్చి చర్చించామని, కారు పార్టీ నాయకుడు తెలిపారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరికతో తమ గెలుపు, ఓటములపై ప్రభావం పడుతుందని, ప్రస్తుతానికి వారు చేరడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం గెలిచిన, ఓడినా కాంగ్రెస్ పార్టీలో వారు చేరడం ఖాయం అని స్పష్టం చేశారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రతీకార రాజకీయాలు చేయలేదు, వేధించలేదు !
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, అత్యున్నత హోదాలో ఉండి, తమపై వ్యక్తిగతంగా, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడలేదని, కీలక సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు తెలిపారు తమ రాజకీయ పదవులకు, అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహించలేదని, అక్రమంగా పోలీస్ కేసులో నమోదు చేయించి తనను, తన అనుచర గణంను వ్యక్తిగతంగా వేదించలేదని ఆ నాయకుడు వివరించారు.

రాజకీయాలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా, మంత్రి లక్ష్మణ్ కుమార్, కృషి చేస్తున్నారని, ప్రజా పాలన, ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆ నాయకుడు తెలిపారు. పంచాయతీ ఎన్నికల తరువాత బిఆర్ఎస్ క్యాడర్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని ఆయన. వివరించారు.
