👉 ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా..
J.SURENDER KUMAR,
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం రాత్రి వరకు (ఈ నెల 29 మధ్యాహ్నం నుండి 30 రాత్రి వరకు) ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు.
👉 ఆలయం వరకు వాహనాలకు అనుమతి లేదు!

భక్తులు వాహనాలను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు అనుమతి లేదు గోదావరి నది స్నానాలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని భావించి బ్రాహ్మణ సంఘం, ఇసుక స్తంభం, నంది విగ్రహం చౌరస్తా, ఆర్యవైశ్య సత్రం నుండి ఆలయం వరకు వచ్చే వాహనాలకు ఎలాంటి అనుమతి లేదు.
👉 వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవి !

భక్తులు తమ వాహనాలను నంది విగ్రహం చౌరస్తా, కూరగాయల మార్కెట్, హరిత హోటల్, మంగళిగడ్డ, బ్రాహ్మణ సంఘం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకతో ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని సిఐ రామ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.
