👉 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ !
J SURENDER KUMAR,
రాష్ట్రంలోని సింగిల్ విండో సొసైటీలకు (ప్రాథమిక వ్యవసాయ సహకార క్రెడిట్ సొసైటీ) అత్యధిక సభ్యులు ఉన్న సహకార సంఘం/ రైతు సేవా సహకార సంఘం కోసం అధికారిక పర్సన్-ఇన్-ఛార్జ్( అధ్యక్షులను) కమిటీల నియామకం కోసం
శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 597 ద్వారా ప్రభుత్వ కార్యదర్శి సురేందర్ మోహన్ జారీ చేశారు.

ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార క్రెడిట్ సొసైటీ/ పెద్ద పరిమాణ సహకార సంఘం/ రైతు సేవా సహకార సంఘానికి అధికారిక పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని తక్షణమే (6) నెలల పాటు లేదా, సొసైటీకి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా, ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు ఏది ముందు వస్తే అది వరకు నియమించడానికి సహకార కమిషనర్ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్, కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
