పుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ధర్మపురి బాలుడు !

J.SURENDER KUMAR,

ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తో జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందిన  కసజ్జుల మన్విత్ అనే బాలుడు మెస్సీ తో కరచాలనం చేసి ఫుట్ బాల్ ఆడాడు.

హైదరాబాద్ ఉప్పల్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మైదానంలో శనివారం రాత్రి  ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  గోల్ సాధించిన విషయం తెలిసిందే..

ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లతో కలిసి హైదరాబాద్ చేరుకున్న మెస్సీ స్టేడియంలో అడుగుపెట్టినప్పటి నుంచి  చివరి వరకు గ్యాలరీలో ఉన్న క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు.

మొదట ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో మెస్సీ కరచాలనం చేస్తూ సరదాగా గడిపారు. ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ అనంతరం మెస్సీ బృందాల వారిగా ఫుట్‌బాల్‌ కిక్స్‌ ఇస్తూ పిల్లలతో ఆడారు.

కసజ్జుల మన్విత్ ( వృత్వంలో )

ధర్మపురి పట్టణానికి చెందిన, రిటైర్డ్ ఉద్యోగి ( ఐటీడీఏ) కాశోజుల రాజేందర్, మనవడు మన్విత్. ( రాజేందర్ కుమారుడు మనోజ్  సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనయుడు మన్విత్ )


ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తో  మన్విత్ పుట్‌బాల్ ఆడిన తీరును గత రెండు రోజులుగా మన్మిత్ గూర్చి  ప్రశంసిస్తూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మెస్సితో ఫోటో దిగడానికి ₹10 లక్షల రూపాయల డిమాండ్ ఉండగా ఏకంగా మన్విత్ అతడితో ఫుట్ బాల్ ఆడడం అభినందనీయమే.