ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి !

👉 ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్‌తో ఆడనున్న సీఎం !

J.SURENDER KUMAR,

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్‌తో ఈ నెల 13 న జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) లీయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది. లీయనెల్ మెస్సీ టీమ్ తో
సీఎం రేవంత్ రెడ్డి  టీమ్ పోటీ ఆడనున్నారు. ఫుట్ బాల్ టీమ్ కు  కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు.