గంజాయి విక్రయ దారులకు 7 సంవత్సరాల శిక్ష !

👉 ఒక్కొక్కరికి ₹15 వేల జరిమానా !

👉 ఫస్ట్ క్లాస్ అడిషనల్  డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ నారాయణ కీలక తీర్పు!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా గొల్లపల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా మరియు అమ్మకానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా  మొదటి సెషన్స్ జడ్జి  నారాయణ గారు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹15 వేల జరిమానా విధిస్తూ. బుధవారం కీలక తీర్పునిచ్చారు.


👉 వివరాలు ఇలా ఉన్నాయి…


A1) మారంపల్లి లక్ష్మణ్ S/o నర్సయ్య, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం: బాలపల్లి గ్రామం,

A2)  దొమ్మటి కార్తిక్ S/o శ్రీనివాస్, వయస్సు 24 సంవత్సరాలు, నివాసం: అబ్బాపూర్ గ్రామం,

A3) మల్యాల అజయ్ S/o ఎర్రయ్య, వయస్సు 24 సంవత్సరాలు, నివాసం: పెగడపల్లి గ్రామం

2024 ఫిబ్రవరి 16న  ఇద్దరు వ్యక్తులు బజాజ్ పల్సర్ బైక్ నం. TS11ES 8312 పై నిషేధిత గంజాయిని సరఫరా చేయడానికి వస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌.ఐ సతీష్  తన సిబ్బందితో కలిసి చిల్వకోడూర్ టి జంక్షన్  తనికిలు నిర్వహిస్తుండగా సాయంత్రం  గంటల సమయంలో, పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఒక నల్లటి బ్యాగ్‌తో రావడాన్ని గమనించి పోలీసుల చాకచక్యంతో వారిని పట్టుకున్నారు.


తెల్లటి ప్లాస్టిక్ కవర్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం గంజాయి బరువు 13.282 కిలోలు, పట్టుబడిన గంజాయి విలువ  సుమారు ₹ 2,65,640/-   అనే పోలీసులు పేర్కొన్నారు.

కేసు విచారణలో సేకరించిన ఆధారాలు, నిందితుల ఒప్పుకోలు, సాక్ష్యాలు ఆధారంగా, న్యాయమూర్తి కీలకతీర్పునిచ్చారు.

👉 ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ.. 

నిందితుల చర్యలు చట్టవిరుద్ధమైనవే కాకుండా, సమాజానికి హానికరమైనవి  గంజాయి వంటి మత్తు పదార్థాల పెంపకం, సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ  సతీష్ ,పి.పి. కే. మల్లేశం గౌడ్ , CMS ఎస్సై ఎస్. శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ ,CMS కానిస్టేబుల్ రాజు నాయక్, కిరణ్ కుమార్  లను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, ప్రత్యేకంగా అభినందించారు.