గోదావరి తీరంలో పులి ?

J SURENDER KUMAR,

నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లా పరిధిలోని గోదావరి నది తీరంలో పులి సంచారం కొనసాగుతున్నట్టు అటవీశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచారం.

కవ్వాల అభయారణ్యం నుంచి  గత కొన్ని రోజుల క్రితం ఓ పులి అదృశ్యం అయినట్టు సమాచారం. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై మైదాన ప్రాంతాల్లో పులి అడుగులను పర్యవేక్షిస్తున్నారు. జన్నారం పరిసర ప్రాంతాల వరకు పులి అడుగులు ఉన్నట్టు అటవీ శాఖ అధికారుల నిర్ధారించినట్టు సమాచారం.

అయితే పులి గోదావరి నది తీరంలో, బీర్పూర్ ధర్మపురి, రాయికల్ మండల పరిధిలోని నది తీరం దాటి జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అటవీ శాఖ  యంత్రాంగం ముందస్తుగా జిల్లా పోలీసులను అప్రమత్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు ఆయా మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిసింది.
పులి సంచారాన్ని అటవీ శాఖ పోలీస్, అధికారులు  అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.