👉 న్యాయమూర్తి సుధారాణి !
J SURENDER KUMAR,
ప్రజలు, ప్రతి పౌరుడు, మానవ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి, భారత రాజ్యంగం పౌరులకు హక్కులతో పాటు భాధ్యతలను ఇచ్చినది. ఈ హక్కులను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంథని కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ సుధారాణి అన్నారు.
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ (అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని) సందర్భంగా బుధవారం మంథని పట్టణంలోని గిరిజన సంక్షేమ జూనియర్ గురుకుల బాలికల కళాశాలలో మండల న్యాయ సేవ అధికారిక సంస్థ ఆధ్వర్యంలో, జరిగిన హక్కుల అవగాహన కార్యక్రమం లో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

👉 ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాఘోత్తం రెడ్డి మాట్లాడుతూ..
ప్రజలు ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని డిసెంబర్10, 1948 నీ ఐక్యరాజా సమితి మానవ హక్కుల రోజుగా ప్రకటించిందన్నారు. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఈ మానవ హక్కుల పట్ల జాగుృతతో ఉన్నామని చెప్పి హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజలు ప్రశ్నించాలని కోరారు అని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కటకం శ్రీనివాస్, విజయకుమార్, శశిభూషణ్ కాచే, అరుణశ్రీ, సబీనా, కళాశాల లెక్చరర్లు ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
