👉 2025 వార్షిక ప్రెస్‌మీట్ లో వివరాలను వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
జిల్లాలో గత సంవత్సర కాలంలో నేరాల శాతం తగ్గింది అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. 2025 డిసెంబర్ మూడో వారం వరకు పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని మంగళవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఎస్పి వార్షిక ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించారు.
👉 నమోదైన నేరాలు !
2025లో జిల్లాలో 5,620 నేరాలు నమోదు కాగా, 2024లో నమోదైన 5,919 కేసులతో పోలిస్తే 229 కేసులు తగ్గాయని తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో నమోదైన కేసులు 5.05 శాతం తగ్గాయి.
👉 అత్యధిక నేరాలు ! 👉 అత్యల్ప నేరాలు !
జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ – 770 కేసులు. అత్యల్ప నేరాలు: బుగ్గారం పోలీస్ స్టేషన్ – 135 కేసులు నమోదు కావడం జరిగింది. హత్యలు, అత్యాచారాలు, అపహరణలు వంటి తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయడం జరిగింది. 2025లో మొత్తం 29 హత్య కేసులు నమోదయ్యాయి. కుటుంబ కలహాలు , ఆస్తి వివాదాలు, కట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు.
👉 ప్రాపర్టీ కేసులు (దొంగతనాలు)
2025లో 381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 187 కేసులు చేధించి ₹ 2,92,37,439/ విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగింది. రికవరీ శాతం(69.85%).
👉 SC/ST కేసులు:
మొత్తం 104 కేసులు నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి.
👉 పీడీఎస్ రైస్ కేసులు:
19 కేసులు నమోదు చేసి, 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
👉 ఇసుక అక్రమ రవాణా:
234 కేసులు, 410 నిందితులు, 260 వాహనాలు స్వాధీనం.
👉 గేమింగ్ యాక్ట్:
167 కేసులు నమోదు చేసి, ₹30,62,036/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
👉 డ్రంక్ అండ్ డ్రైవ్:
మొత్తం 9,290 కేసులు నమోదు చేయగా, 14 మందికి జైలు శిక్షలు విధించబడ్డాయి.
👉 రోడ్డు ప్రమాదాలు:
2024తో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ, మృతుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధిక శబ్దం చేసే 130 మోడిఫైడ్ సైలెన్సర్లు తొలగించారు.
👉మాదక ద్రవ్యాల నియంత్రణ:
2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసి, 86 కేసులు, 203 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. వీటితో పాటు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. యువతలో గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతలకు ప్రథమ బహుమతి ₹15,000/-, ద్వితీయ బహుమతి ₹10,000/-, తృతీయ బహుమతి ₹5,000/- అందజేశాము.

👉 రౌడీ షీట్స్:
ప్రస్తుత సంవత్సరంలో తరచుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై మొత్తం 76 హిస్టరీ షీట్లు ఓపెన్ చేయగా, అందులో హత్య కేసుల్లో పాల్గొన్న నేరస్తులపై 33 రౌడీ షీట్లు ఉన్నాయి.
👉 పీడీ యాక్ట్:
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో 2025 సంవత్సరంలో 01 పీడీ యాక్టులు నమోదు చేయడం జరిగింది.
👉 డయల్-100:
డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 4 నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది.మొత్తం 30,954 డయల్–100 కాల్స్ అందగా, వాటిలో 130 కేసులు FIR లు.నమోదు చేశారు
👉 గల్ఫ్ ఛీటింగ్ కేసులు:
గల్ఫ్ కు పంపిస్తానని మోసం చేసిన 44 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
👉 అక్రమ వడ్డీ:
అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై 07 కేసులు నమోదు చేయడం జరిగింది.
👉 ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్–XI:
2025 సంవత్సరంలో జనవరి, జూలై నెలల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్& ముస్కాన్–XI కార్యక్రమాలు నిర్వహించి, 76 మంది పిల్లలను రక్షించి, వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం జరిగింది.
👉 385 గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలు–2025:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమలులో భాగంగా 21 కేసులు నమోదు చేసి 21 మంది నిందితుల నుంచి ₹2,07,643.50 విలువైన 318.76 లీటర్ల IMFL మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది.అదేవిధంగా 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి ₹ 80,800/- విలువైన 199.5 లీటర్ల ID మద్యం (గుడుంబా)ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
👉 సంచలనాత్మక కేసులు:
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో 5 సంవత్సరాల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రజల ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. ఆదేవిదంగా 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని ₹ 25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరియు జగిత్యాల పట్టణంలో జరిగిన డకాయితీ కేసును ఛేదించి 8 మందిని అరెస్ట్, నిందితుడిపై పిడి ఆక్ట్ నమోదు చేశామని తెలిపారు.
👉 సైబర్ నేరాలు:
2025లో 1,351 సైబర్ ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో ₹1.72 కోట్ల నగదు బాధితులకు తిరిగి అందించామని తెలిపారు. మొత్తం 1,079 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.
👉 CEIR ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీ!
1,551 పోయిన మొబైల్ ఫోన్లు గుర్తించి ₹3.10 కోట్ల విలువైన ఫోన్లు బాదితులకు అందించామని తెలిపారు.
👉 లోక్ అదాలత్ & కోర్ట్ వెర్టికల్ !
సమాజంలో నేరాలకు పాల్పడిన ఎవరూ శిక్షల నుండి తప్పించుకోవద్దని,పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణలు చేపట్టి, పటిష్టమైన న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కరించామని తెలిపారు.
👉 బందోబస్తు:
VIP/VVIP పర్యటనలతో పాటు ధర్మపురి బ్రహ్మోత్సవాలు, పెంబట్ల మహాశివరాత్రి, పెద్దాపూర్ మల్లన్న, కొండగట్టు హనుమాన్ జయంతి, గణేష్ నవరాత్రులు, రంజాన్, మల్లన్నపేట జాతర వంటి అన్ని పండుగలు, జాతరల బందోబస్తు కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జగిత్యాల జిల్లాలో 11 మంది ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో జిల్లా పోలీసుల పర్యవేక్షణలో చురుకుగా భాగస్వాముల్ని చేశారు. హైదరాబాద్ తరువాత ట్రాన్స్‌జెండర్లను భాగస్వాముల్ని చేసిన రెండవ జిల్లాగా జగిత్యాల నిలిచింది.
👉 సీపీఆర్ శిక్షణ !
ఫస్ట్ రెస్పాండర్స్ & పోలీస్ సిబ్బందికి రోడ్ సేఫ్టీ లో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో బాధితులను వెంటనే రక్షించేందుకు జిల్లా పోలీసులు రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు, హోటల్ కార్మికులు, పంక్చర్ షాప్ కార్మికులు, పెట్రోల్ బంక్ సిబ్బంది వంటి ఫస్ట్ రెస్పాండర్స్‌తో పాటు పోలీస్ సిబ్బందికి సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ అందించి, ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
👉 సిసి కెమారాలు:
2025 సంవత్సరంలో జిల్లా కమాండ్ & కంట్రోల్ సెంటర్‌కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల టౌన్, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పోలీస్ స్టేషన్లు మరియు కొండగట్టు ఆలయం పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 383 ITMS కెమెరాలను అనుసంధానం చేశారు.ప్రజల సహకారంతో ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జియో–ట్యాగింగ్ చేశారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలో 123, మెట్పల్లి పట్టణంలో 76 కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
👉 గ్రీవెన్స్ డే :
ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి గ్రీవెన్స్ డే,శ్రీకారం చుట్టి ప్రజల వద్ద నుండి 720 ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం న్యాయం చేయడం జరిగింది.
👉 కమ్యూనిటీ పోలీసింగ్:
పోలీస్ కళ బృందo ద్వారా 28,500 మందికి అవగాహన కల్పించడం జరిగింది.
👉 మై ఆటో ఇస్ సేఫ్ !
పగలు, రాత్రి ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉండేలా, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసులు కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని 2,093 ఆటోల వివరాలు నమోదు చేసి ప్రతి ఆటోకు యూనిక్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.
👉 యాంటీ–ర్యాగింగ్ కార్యక్రమం:!
విద్యాసంస్థల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు యాంటీ– ర్యాగింగ్ చట్టాలు, విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ర్యాగింగ్ నివారణపై విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది.
జిల్లా పోలీస్ శాక ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 600 మంది పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
సమావేశంలో అదనపు ఎస్పి శేషాద్రిని రెడ్డి, డిఎస్పి లు వెంకటరమణ, వెంకటరమణ, రఘు చందర్, రాములు ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
