👉 ఈనెల 24 న… 2026, జనవరి 7 న…!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో..!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా అయ్యప్ప భక్తుల చిరకాల స్వప్నం సహకారం కానున్నది, జగిత్యాల రైల్వే స్టేషన్ నుండి శబరిమల పుణ్యక్షేత్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ఈ నెల 24 న, 2026 జనవరి 7 న ఈ రైళ్లు జగిత్యాల రైల్వే స్టేషన్ లో అయ్యప్ప భక్తులకు అందుబాటులో ఉంటాయి. నాందేడ్ మీదుగా కేరళ రాష్ట్రం శబరిమలై సమీపంలోని ఈ కొల్లం వరకు సౌకర్యం ఉంటుంది. గతంలో ఈ ప్రాంత అయ్యప్ప భక్తులు సికింద్రాబాద్, వరంగల్, మంచిర్యాల్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లి అక్కడ నుంచి శబరిమలై వెళ్లేవారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో..

గత వారం రోజుల క్రితం జగిత్యాల పర్యటనలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర నాయకుడు ముఖేష్ ఖన్నా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు గూర్చి విజ్ఞప్తి చేశారు.. మంత్రి లక్ష్మణ్ కుమార్ కు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు, ఫోన్ ద్వారా పరిస్థితి, ప్రత్యేక రైలు ఆవశ్యకతను వివరించి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
👉 మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు గురు స్వామి దశరథ్ రెడ్డి !

జగిత్యాల జిల్లా అయ్యప్ప స్వాములు చిరకాల స్వప్నం జగిత్యాల నుండి శబరిమలైకు ప్రత్యేక రైలు స్వప్న సహకారం చేసిన మంత్రి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ కు ,జగిత్యాల అయ్యప్ప గురుస్వామి దశరథ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
👉 మంత్రి స్పందించి చర్యలు తీసుకున్నారు !

జగిత్యాల జిల్లా అయ్యప్ప స్వాముల సౌకర్యం జగిత్యాల నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని మంత్రి లక్ష్మణ్ కుమార్ సకాలంలో స్పందించారని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నాయకుడు ముఖేష్ ఖన్నా అన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
