J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి గెలుపొందారు. ఆదివారం పట్టణంలోని శ్రీదేవి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పోలింగ్ దాదాపు 160 ఓట్లు పోలయ్యాయి. పోటా పోటీగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. పోలైన ఓట్లు లెక్కింపు అనంతరం ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి ఫలితాలను ప్రకటించారు.
అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీ పడగా ఎల్లాల రాజేందర్రెడ్డి తన సమీప పై 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా కందుకూరి శశిధర్ తన సమీప ప్రత్యర్థి పై 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు.

ఉపాధ్యక్షులుగా ముసిపట్ల దేవేందర్, బద్దెనపల్లి మల్లేశం, శనిగరపు శ్రీనివాస్ విజయం సాధించగా కోశాధికారిగా బోయినపల్లి శ్రీధర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కదార్ల రంజిత్, సంయుక్త కార్యదర్శులుగా బద్దం నారాయణరెడ్డి, గంటే మహేష్ లు విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా నీరటి గంగాధర్, కల్లెడ గంగాధర్ (హరీష్) ఎల్ల క్రాంతి కుమార్, సామా మహేష్, వాసం రఘు, ఎండి సాబిర్, కట్కూరి సంతోష్, దిండిగల శ్రీనివాస్ విజయం సాధించారు.
టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ వ్యవహరించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎన్నికల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేయాలని కోరారు.
