J SURENDER KUMAR,
కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా జగిత్యాల పట్టణానికి చెందిన చిలకమర్రి మదన్మోహన్ ను కేంద్ర న్యాయ శాఖ పర్యవేక్షణ శాఖ నియమించింది. జగిత్యాల జిల్లా ప్రధాన కోర్టుతోపాటు ధర్మపురి, మెట్టుపల్లి, కోరుట్ల కోర్టులలో కేంద్ర ప్రభుత్వ సంబంధిత వివాదాల అంశాల పట్ల మదన్మోహన్ వాదించానున్నారు.
ఈ సందర్భంగా న్యాయవాది మదన్మోహన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామ్ చందర్ రావు, బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు గోకుల్ రామారావు లకు కృతజ్ఞతలు తెలిపారు.
మదన్మోహన్ నియామకం పట్ల జగిత్యాల జిల్లాలోని న్యాయవాదులు పలు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు, లు వివిధ కులసంఘాలు హర్షం వెలిబుచ్చాయి
