కేంద్ర మంత్రులను ఆహ్వానించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి !

👉 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  న్యూఢిల్లీలో బుధవారం పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా. పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ , రైల్వే, ఐటీ & సమాచార ప్రసార శాఖ మంత్రి  అశ్వినీ వైష్ణవ్ , కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్‌లాల్ ఖట్టర్ ను విడివిడిగా కలిశారు.

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి బృందం ఆహ్వానించారు.

గ్లోబల్ సమిట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యాలు మరియు ప్రాధాన్యత అంశాలను కేంద్ర మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి , కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్ట్కార్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి , డాక్టర్ కడియం కావ్య , గడ్డం వంశీ కృష్ణ , అనిల్ కుమార్ యాదవ్  ఉన్నారు.