👉సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి!
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు లో చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆవుతాయి ఒక్కొక్క కుటుంబం లక్షలాది రూపాయల నష్టం జరిగిందని, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వపరంగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారికి ఆర్థిక సాయం అందించాలని సీఎం ను అభ్యర్థించారు. బాధితులను ప్రభుత్వ పక్షాన ఆదుకుంటామని. నష్టపోయిన చిరు వ్యాపారుల వివరాలు, అధికారుల విచారణ నివేదిక మేరకు ఆదుకుందామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
