J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నట్టు మంత్రి అన్నారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంత్రి సాదాసీదాగా కొండగట్టుకు క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి వేద స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు.
