👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉 కుక్కలు దాడిలో గాయపడిన బాలుడి సంఘటనలో స్పందించిన ప్రభుత్వం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు
సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ !
👉 బాలుడిని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్!
👉 అత్యవసర సాయం కింద లక్ష రూపాయలు !
👉 బాలుడికి పెన్షన్ స్పెషల్ పాఠశాలలో అడ్మిషన్
కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు !
J SURENDER KUMAR,
కుక్కలు కరిచిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్య సదుపాయాలతో పాటు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ ఎల్బీనగర్, మన్సురాబాద్ శివగంగా కాలనీలో రెండు రోజుల క్రితం ప్రేమ్ చంద్ అనే బాలుడిని కుక్కల కరిచిన సంఘటన పై ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఫోన్ చేసి బాలుడికి మెరుగైన వైద్య సేవలతో పాటు బాలుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ అండదండల గూర్చి వివరించాలని కోరారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ గురువారం హుటాహుటినా నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన బాలుడిని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలతో పాటు మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి మంత్రి మనోధైర్యం కల్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలుడి ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు కు ఫోన్ చేసి సత్వరమే బాలుడు ప్రేమ్ చంద్ కు ఖరీదైన వైద్య సదుపాయం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అని తెలిపారు.
బాలుడి తల్లిదండ్రులు తిరుపతి రావు , చంద్రకళ దంపతులకు ప్రభుత్వ పక్షాన లక్ష రూపాయల చెక్కును అందించానన్నారు. బాలుడికి పెన్షన్, స్పెషల్ పాఠశాలలో అడ్మిషన్
కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు.
బాధిత బాలుడి తండ్రి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి
దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారని, అర్హత ప్రకారం దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయడంతో పాటు బాలుడి ఆరోగ్యం కుదుట పడగానే సంరక్షణ కు కావలసిన సదుపాయాలు కల్పించడం, పునరావాస సహాయ అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మంత్రి వివరించారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు సకాలంలో స్పందించి బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంత్రి వెంట దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, ఆసుపత్రి సూపరిండెంట్ బాబురావు ,ఆర్ ఎం ఓ , ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
