లొంగుబాటు దిశలో 40 మంది మావోయిస్టులు ?

J.SURENDER KUMAR,

కామారెడ్డి జిల్లా ,మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ,ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు చెందిన గొల్లపల్లి రవి  మావోయిస్టు పార్టీలో చాలా కాలం పని చేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, డిజిపి పిలుపు మేరకు లొంగిపోయారు.

ఇతనితో పాటు దాదాపు 35 నుంచి 40 మంది  నక్సలైట్లు తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయే అవకాశo . శుక్రవారం విలేకరుల సమావేశంలో వీరిని చూపించే అవకాశం ఉంది . దీనిలో కొంతమంది ఆయుధాలతో లొంగిపోయారని సమాచారం.

👉 పోలీసుల అదుపులో PDSU విద్యార్థి నాయకుడు  ప్రభంజన్…?

మావోయిస్టు  అర్బన్  కో  ఆర్డినేటర్ అనే కారణంగా పోలీసుల విద్యార్థి సంఘ నాయకుడు ప్రభంజన్ ను అదుపులో తీసుకున్నట్టు సమాచారం.

ప్రభంజన్, మావోయిస్ట్ లకు  షెల్టర్ ఇస్తున్నట్లు పోలీసుల అనుమానం.
మంచిర్యాల జిల్లా జన్నారం కు చెందిన ప్రభంజన్ మావోయిస్ట్ లకు షెల్టర్ పేరిట డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు, ఆరోపణలతో అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి వుంది.