మామిడి తోటల్లో చేపట్టవలసిన చర్యలు !

👉 ఉద్యాన అధికారిని ఎం అర్చన !

J.SURENDER KUMAR

పూత పిందే దశలలో సాధారణంగా మామిడి తోటల్లో డిసెంబర్ మాసంలో పూత రావడం  గమనిస్తుంటాము. కానీ కొన్ని అనివార్య వాతావరణ పరిస్థితుల ద్వారా తోటల్లో సగ భాగం పూత, సగం భాగం కోలు  రావడం గమనించడం జరుగుతుంది. అయితే పూతకు ముందు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం అవసరమని
ధర్మపురి ఉద్యాన అధికారి ఎం ఎం అర్చన అన్నారు.

👉 చేపట్టాల్సిన చర్యలు..

👉 మామిడి తోటలలో లోతైన దుక్కులు, దున్నడం లాంటివి చేయకూడదు.

👉 నవంబర్ మాసం నుండి డిసెంబర్ రెండవ వారం వరకు పూర్తిగా మామిడి తోటలను  బెట్ట (నీటిని ఇవ్వకుండా ఉండడం) ఉంచవలసి ఉంటుంది.

👉 పూతకు ముందు ఒకసారి మామిడి తోటలకు *ప్రోఫినోపాస్ @ 1 lit+ sulphur @1.5 kg ఒక ట్రాక్టర్ + వేప నూనె 1000ppm ఒక లీటర్* ఒక ట్రాక్టర్ డ్రమ్ముకు కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా చెట్లకు ఉండే చీడపీడలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

👉 చెట్లకు సగం పూత మరియు సగం కోలు గమనించినట్లయితే  డిసెంబర్ మొదటి వారంలో మరొకసారి *13.0.45 @5kg + బోరాన్@ 1 కిలో ఒక ట్రాక్టర్* డ్రమ్ముకు కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా పూతను ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది.

👉 తోటలో సగానికి ఎక్కువ మొత్తంలో పూత గాని లేదా మొట్టెలు గానీ గాని గమనించిన తర్వాత  మాత్రమే  చెట్లకు ఒకసారి నీటిని అందించాలి అది కూడా భూమి స్వభావాన్ని బట్టి కేవలం *పలుచని నీటి తడులు* మాత్రమే ఇవ్వాలి ఒక వారం తర్వాత పూత మొత్తం ఒకేసారి మొట్టెలు పలికి పూత బయటికి వచ్చి ఆస్కారం ఉంటుంది కావున రైతులు ఈ సమయంలో నీటిని అధిక మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో అందించరాదు. అధిక నీటిని ఒకేసారి అందించడం ద్వారా బెట్ట తర్వాత చెట్టులోని సడన్ చేంజెస్ రావడం ద్వారా పూత రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కావున మొదటి రెండు తడులు పలుచనీ నీటి తడులు ఇచ్చిన తర్వాత మాత్రమే పూర్తిస్థాయిలో నీటి తడిని ఇవ్వాలి.

👉. కొన్ని తోటల్లో పూత వచ్చి నలుపు రంగులోకి మారి రాలిపోవడం కూడా గమనించడం జరుగుతుంది. సాధారణంగా వాతావరణం లోని పరిస్థితులు అదే విధంగా రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం ద్వారా ఇది జరుగుతుంది. అంతేకాకుండా చెట్లకు అధికంగా హాప్పర్స్ (Hoppers) తేనెమంచి పురుగు, గుర్రపు పురుగు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దీని నివారణకు మామిడి పచ్చిపూత దశలో Thiomethaxam @200 gr + hexaconozol @1lit + neem oil 1000 ppm @1 lit* ఒక ట్రాక్టర్ డ్రమ్ము కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి.

👉 పూత పూర్తిగా విచ్చుకొని *తెల్ల పూత దశలో* ఉన్నట్లయితే

  *Imidacloprid @150   ml + hexaconozol @1lit లేదా నేటివో @ 250 gr + neem oil 1000 ppm @1lit* ఒక ట్రాక్టర్ ట్రమ్ముకు కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

👉  నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాల లోపం వల్ల పిందే రాలే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టిపదవ సంవత్సరం (10 years) చెట్లకు *2 కిలోల యూరియా + 6 కిలోల సూపర్ +1.5 కేజీ పొటాష్ ఎరువులను* వేసుకోవాలి అందులో *జూన్- జూలై* మాసంలో కొమ్మ కత్తిరింపులు అనంతరం 2/3 భాగం ( *1400 గ్రా యూరియా +  4 కేజీ ల సూపర్+1కేజీ పొటాష్* )  ఇవ్వాలి. అంతే కాకుండా కాయ బఠానీ గింజ లేదా  గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు *జనవరి – ఫిబ్రవరి* మాసంలో 1/3 భాగం ఎరువులను అనగా ( *500 గ్రా యూరియా+2కేజీ సూపర్ +500 గ్రా పొటాష్* ) ప్రతి చెట్టుకు అందించాలి.

👉. హార్మోన్ల అసమతుల్యత మరియు సూక్ష్మ పోషకాలు లోపం.* ద్వారా కూడా పిందెలు పసుపు రంగులోకి మారి రాలిపోవడం గమనిస్తుంటాము. వీటి నివారణకు కాయ బఠాని గింజ నుండి నిమ్మకాయ దశలో ఉన్నప్పుడు రెండుసార్లు *13.0.45 @2.5కేజీ + ఫార్ములా -4@2.5కేజీ + ప్లానో ఫిక్స్@100 ml ఒక ట్రాక్టర్ డ్రమ్ము నీటిలో* కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

👉  పదవ సంవత్సరం చెట్లకు పిందె దశలో *బోరాక్స్ 150 గ్రాములు జింక్ సల్ఫేట్ 150 గ్రాములు* ప్రతి చెట్టుకు కొమ్మ కత్తిరింపుల అనంతరం లేదా కాయ బఠానీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు వేసుకోవాలి.

👉 మామిడి తోటలను  అక్టోబర్ -నవంబర్ మాసంలో బెట్టకు విడిచినా అనంతరం ఒకేసారి ఎక్కువ మోదాతులో నీటిని ఇవ్వడం ద్వారా  పూత మరియు పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. కావున మొదటి రెండు తడులను పలుచని నీటితడులు ఇచ్చిన తర్వాత మాత్రమే కొంత సమయం తర్వాత తోటకు పూర్తిస్థాయిలో నీటిని అందించవలసి ఉంటుంది అని ధర్మపురి ఉద్యాన అధికారి ఎం అర్చన మామిడి రైతులకు వివరించారు.