👉 పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని మౌలిక వసతులతో పాటు సాగు, తాగు, విద్యా, వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, మంత్రిగా మాట ఇస్తున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ధర్మారం మండలంలోని నందిమేడారం, కొత్తూరు, బంజేరు పల్లె తండా గ్రామాలలో శుక్రవారం పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మారం మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

👉🏻 మండల కేంద్రమైన ధర్మారం పట్టణ అభివృదే లక్ష్యంగా కృషి చేస్తాను !

మండల కేంద్రమైన ధర్మారం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోనీ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన పంచాయతీఎన్నికల ప్రచార సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడవేని పుష్పలత తిరుపతిను అధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి చేయూత ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
👉 ధర్మారం పట్టణ ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంక్షేమ పరిపాలన నూతన స్థాయికి చేరిందన్నారు. ప్రజల నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు, జీవన భద్రతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం రూపుదిద్దిన పథకాలు ప్రస్తుతం ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని మంత్రి వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణుల భారాన్ని తగ్గించే ₹ 500 గ్యాస్ సిలిండర్ పథకం, రైతుల కోసం రైతుబంధు, ప్రమాదాల్లో కుటుంబాలకు సహాయంగా రైతు భీమా, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు గృహ భద్రత కల్పించే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు, విద్యార్థులకు విద్యాధన–వసతి దీవన రాయితీలు, నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలు వంటి పథకాలు రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్నాయని మంత్రి తెలిపారు.
స్థానిక సమస్యలైన రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల విస్తరణ, వ్యవసాయ సహాయాలు, పశుసంవర్ధక సౌకర్యాలు వంటి అంశాలపై ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.
మండల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
