J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం అర్ధ రాత్రి వరకు అయ్యప్ప పడిపూజ ( మెట్ల పూజ ) అంగరంగ వైభవంగా జరిగింది.

ధర్మపురి క్షేత్రానికి చెందిన పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి, హైదరాబాద్ కు చెందిన మణికంఠ శర్మ గురుస్వామి, వారి శిష్య బృందంతో అయ్యప్ప మెట్ల పూజ వేద మంత్రాలతో నిర్వహించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆయన కుమారుడు హరీశ్వర్ లు అయ్యప్ప దీక్షలో కొనసాగుతున్నారు.

నియోజకవర్గం తో పాటు ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు స్వామి వారి పడిపూజకు వచ్చారు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం, పుష్పాభిషేకం, పలాభిషేకం, గంధభిషేకం, తేనె, నెయ్యి అభిషేకాలు వేదోక్తంగా జరిగాయి. ఉదయం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆయన తనయుడు హరీశ్వర్ క్యాంపు కార్యాలయంలో గణపతి హోమం నిర్వహించారు.


