👉 ఉకే గణేష్ హతంతో ఒడిశా మావోయిస్టుల కార్యకలాపాలు సమాప్తం !.
J.SURENDER KUMAR,
” మీ వయస్సు 65 సంవత్సరాలు ఆరోగ్య పరిస్థితులు, మీ తోటి కామ్రేడ్స్ జన జీవన స్రవంతిలో కలిశారు, వారు ఇచ్చిన సమాచారంతో మీరు ఒడిస్సాలో ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం లొంగుబాటుకు సానుకూలంగా ఉంది మీరు ఎక్కడ ఉన్నా లొంగిపొండి,” అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు
పాక హన్మంతు @యుకే గణేష్, ఒడిశ్శా ఇంచార్జ్, కుటుంబ సభ్యుల, గణేష్ బావ ప్రదీప్ అభ్యర్థన అరణ్య రోదన అయ్యింది.

గురువారం ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో పాక హనుమంతు @ ఊకె గణేష్ తో పాటు చత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయిగడ ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు, ప్లాటూన్ మెంబర్ రాకేష్ అలియాస్ బారీ, సప్లై టీమ్ మెంబర్ అమృత్ లతో పాటు మరొకరు మృతి చెందిన విషయం తెలిసిందే.
పాక హనుమంతు @ గణేష్ తన తల్లికి 2022 లో రాసిన లేఖ ప్రచార మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ( 2021 లో తన తండ్రి మృతి చెందిన నేపథ్యంలో )


గత కొన్ని నెలల క్రితం గణేష్, బావ ప్రదీప్ ఒడిస్సా రాష్ట్రంలో గణేష్ ఆచూకీ కోసం ప్రయత్నించారు. గణేష్ సమాచారం, ఆచూకీ తెలియకపోవడంతో ఓ లేఖ ( గణేష్ ను ఉద్దేశించి లొంగుబాటుకు అభ్యర్థిస్తూ ఉత్తరం రాశారు ) వీడియో ద్వారా అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాదాపు 45 సంవత్సరాలు అజ్ఞాతవాసం పట్టిన గణేష్ లొంగుబాటు కోసం ఆయన కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకుల, బంధువుల, ఆవేదన అభ్యర్థన అరణ్య రోదనగా మారడం బాధాకరం.
